ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం మరో మెగా డీఎస్సీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు అందించనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి రెండవ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షా ఫలితాలు 2026 జనవరి 19న విడుదలైన విషయం తెలిసిందే.
ఖాళీల వివరాలు : గత సంవత్సరం జరిగిన డీఎస్సీ లో మిగిలిపోయిన పోస్టులు , ఈ సంవత్సర కాలంలో ఖాళీ అయిన ఉద్యోగాలతో కలిపి సుమారుగా 2,500 నుండి 10,000 పోస్టుల వరకు ఉండవచ్చు అని ప్రాథమిక అంచనా.
| పోస్టుల వివరాలు : 1) SGT (Secondary Grade Teacher): ప్రాథమిక పాఠశాలల కోసం. 2) School Assistant (SA): సబ్జెక్టుల వారీగా హైస్కూల్ విభాగం. 3) TGT & PGT: మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో. 4) Special Education: దివ్యాంగుల పాఠశాలల్లో బోధించడానికి ప్రత్యేక పోస్టులు. |
| అర్హతలు : ఈ మెగా డీఎస్సీ కి సంబంధించి B.Ed / D.Ed తో పాటు టెట్ (TET) లో అర్హత సాధించి ఉండాలి. |
| వయసు : ఈ ఉద్యోగాలకు సంబంధించి గతంలో లాగానే సాధారణ అభ్యర్థులకు 44 సంవత్సరాలు గరిష్ట వయసు పరిమితి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది. |
| కీలక మార్పులు : ఈ నోటిఫికేషన్ లో కొత్తగా భోధన పరీక్షలో నాణ్యతను పెంచేందుకు ఆంగ్ల భాష సామర్థ్యము మరియు కంప్యూటర్ పైన అదనపు ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈసారి డీఎస్సీ లో ఇంగ్లీష్ బోధించే సామర్థ్యము పరీక్షించేలా ప్రశ్నలు ఉండవచ్చు. ఇంకా డిజిటల్ విద్యపైన ఉండాల్సిన కనీస అవగాహనా ఉందా లేదా అనేది కూడా పరిక్షించేలా ఒక విభాగం ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుత విద్య ప్రమాణాలకు అనుగుణంగా ఇప్పటివరకు ఉన్న సిలబస్ లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. |
| సిలబస్ ఎలా ఉంటుంది : పార్ట్ 1 : జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 : ప్రేస్పెక్టీవ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పార్ట్ 3 : క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ పార్ట్ 4 : సంబంధిత సబ్జెక్టు మరియు మెథడాలజీ |
| ఎంపిక విధానం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేయవచ్చు అని భావిస్తున్న మెగా డీఎస్సీ 2026 కు సంబంధించి ఎంపిక విధానం గతంలో నిర్వహించిన డీఎస్సీ లాగానే ఉండవచ్చు అని సమాచారం. ఇందులో గతంలో సాధించిన టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. 1) టెట్ స్కోర్ : 20% వెయిటేజీ 2) రాత పరీక్ష : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు. 3) మెరిట్ లిస్ట్ : టెట్ మరియు రాత పరీక్షలో సాధించిన మార్కులకు కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. 4) చివరగా మెరిట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. |
| ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాలనే మీ కలను నిజం చేసుకునే సమయం ఇది. ఇప్పుడే మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించండి! విజయం మీదే. ఆల్ ది బెస్ట్! |
మెగా డీఎస్సీ కి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? సిలబస్ లేదా అర్హతల గురించి మరింత సమాచారం కావాలంటే కింద కామెంట్ చేయండి
#NaraLokesh #APEducation #LatestJobAlerts #UdyogaVedika
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.