పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 5138 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం డిగ్రీ అర్హత కలిగి ఉండి 28 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హతలు దరఖాస్తు విధానము, ఫీజు తదితరల కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇక్కడికే ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం :::
సంస్థ పేరు : పంజాబ్ నేషనల్ బ్యాంక్
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 5138
| రాష్ట్రము పేరు | ఉద్యోగాల సంఖ్య |
| ఆంధ్రప్రదేశ్ | 56 ఉద్యోగాలు |
| తెలంగాణ | 69 ఉద్యోగాలు |
విద్యార్హతలు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు పరిమితి :: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి 01 జనవరి 2026 నాటికి అభ్యర్థులకు కనీస వయస్సు 20 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు, అలాగే వితంతువులు మరియు విడాకులు పొందిన మహిళా అభ్యర్థులకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అప్లికేషన్ చెల్లించాలి. ఓసి మరియు BC మరియు ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 600 రూపాయల నుంచి 800 రూపాయల ఫీజును చెల్లించాలి. ఎస్సీ మరియు ఎస్టీ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులు 200 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి
జీతభత్యాలు : పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ఉద్యోగాలకు ఎంపికైన ప్రశ్నలకు నెలకు 15000 రూపాయల వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. ఇక ఇతర అలవెన్సులు ఏమి ఉండవు.
కావలసిన పత్రాలు : దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు కు కావలసిన పత్రాలు
| ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ |
| ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ |
| ఈమెయిల్ ఐడి |
| క్యాస్ట్ సర్టిఫికేట్ |
| డిగ్రీ సర్టిఫికెట్ |
| మొబైల్ నెంబర్ |
| పాన్ కార్డ్ |
| పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ |
ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదలుగా ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్లైన అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ పెడతారు. అందులోను ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
పరీక్ష ఎలా ఉంటుంది : ఆన్లైన్ రాత పరీక్ష అనేది మొత్తం వంద మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ మొత్తం పరీక్ష ఒక గంట పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో మాత్రమే నిర్వహిస్తారు.
| అంశము | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్ అవేర్నెస్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ | 25 ప్రశ్నలు | 25 మార్కులు |
| జనరల్ ఇంగ్లీష్ | 25 ప్రశ్నలు | 25 మార్కులు |
| రీజనింగ్ ఆప్టిట్యూడ్ | 25 ప్రశ్నలు | 25 మార్కులు |
| కంప్యూటర్ నాలెడ్జి | 25 ప్రశ్నలు | 25 మార్కులు |
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు వివరాలు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 08 ఫిబ్రవరి 2026. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026
ముఖ్య సమాచారం :
| దరఖాస్తులు ప్రారంభం | 08-02-2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 24-02-2026 |
| నోటిఫికేషన్ | Download / View |
| అప్లికేషన్ | Download / View |
PNBRecruitment2026 #BankJobs #TeluguJobs #UdyogaVedika #JobNotification #GovernmentJobs2026 #ApprenticeJobs #TelanganaJobs #AndhraPradeshJobs #TeluguNaukri #BankingCareer #PNB
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.