భారతదేశంలో అతిపెద్ద టెలికం నెట్వర్క్ అయినటువంటి భారత్ సంచార నిగం లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వయస్సు, విద్యార్హతలు, దరఖాస్తు విధానము, మరియు పరీక్ష విధానం కు సంబంధించి పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన వివరాలను చదవగలరు.
ఉద్యోగాల వివరాలు :: భారత సంచార నిఘం లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
| విభాగము | మొత్తం ఖాళీలు |
| Executive Trainee (టెలికాం రంగం) | 95 ఉద్యోగాలు |
| Executive Trainee (ఫైనాన్స్ రంగం) | 25 ఉద్యోగాలు |
విద్యార్హతలు ::
1.టెలిగ్రామ్ ఆపరేషన్స్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ ట్రైని ఉద్యోగాలకు బాటిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. ఫైనాన్స్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పూర్తి చేసి ఉండాలి
జీతం :: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు నెలకు Rs. 24,900/- రూపాయలు నుంచి Rs.50,500/- రూపాయల వరకు నెలకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు పరిమితి :: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఓబిసి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు వారి కేటగిరీని బట్టి గరిష్టంగా 45 సంవత్సరాల వయసు వరకు అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు.
ఎంపిక విధానము :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా ఆన్లైన్ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ రాత పరీక్ష పూర్తిగా Computer Based Multiple Choice Questions ఉంటాయి. 180 నిమిషాల పాటు ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.
పరీక్ష ఎలా ఉంటుంది :: ప్రతి పరీక్షను 200 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.25% మార్కులను Cut చేస్తారు. ఇక పరీక్ష విధానం ఒకసారి పరిశీలించినట్లయితే టెలికాం రంగంలోని ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలు 40 మార్కులకు 40 Questions ఇస్తారు. పార్ట్ -2 పేపర్ కింద టెక్నికల్ టెలికాం టెస్ట్ అనేది 160 Questions 160 మార్కులకు మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.
ఇక ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా పార్ట్ -1 ఆటిట్యూడ్ టెస్ట్ 40 ప్రశ్నలు 40 మార్కులకు పార్ట్-2 టెక్నికల్ ఫైనాన్స్ టెస్ట్ అనేది 160 ప్రశ్నలు 160 మార్కులకు మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది.

పరీక్షా కేంద్రాలు :: ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ రాత పరీక్షలు మొత్తం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలలో నిర్వహిస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ మరియు ఓబీసీ మరియు EWS కేటగిరి అభ్యర్థులు Rs.2500/- రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఆన్లైన్లో చెల్లించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ మరియు PWD కేటగిరి అభ్యర్థులు Rs.1250/- ఆన్లైన్లో చెల్లించాలి.
ముఖ్యమైన తేదీల వివరాలు ::
| వివరాలు | ముఖ్యమైన తేదీ |
| ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ | 5 ఫిబ్రవరి 2026 |
| ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 7 మార్చి 2026 |
| ఆన్లైన్ పరీక్ష తేదీ | 29 మార్చి 2026 |
| Official Website | View / Download |
| సిలబస్ సమాచారం | View / Download |
| Apply Online | View / Download |
| Official Notification | View / Download |
ముఖ్య గమనిక: మీ మిత్రులకు, వాట్సాప్ గ్రూపులకు తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది!
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.