NTPC ద్వారా 515 ఇంజనీరింగ్ ఉద్యోగాలు: GATE 2025 స్కోర్‌తో భారీ రిక్రూట్‌మెంట్!

NTPC Job Notification 2026 Poster

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPC నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 ఫిబ్రవరి 2026. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం గేట్ 2025లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది.

ఉద్యోగాలు వివరాలు ::

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చేయగల వివరాలు

ఉద్యోగ వివరాలు మొత్తం ఖాళీలు
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 165
మెకానికల్ ఇంజనీరింగ్210
ఎలక్ట్రిషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్125
కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్15

విద్యార్హతలు :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ లేదా మైనింగ్ విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పాసై ఉండాలి. అభ్యర్థికి కనీసం 65% మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ మరియు PWD అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉండాలి. అలాగే గేట్ 2025లో మంచి స్కోర్ వచ్చి ఉండాలి.

జీతం మరియు ఇతర ప్రయోజనాలు: : నెలకు 40,000 నుంచి 1,40,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లించడం జరుగుతుంది. DA, HRA, మెడికల్ సదుపాయాలు మరియు ఇతర అలవెన్సులు కలిపి ఏడాదికి దాదాపు Rs. 12-15 లక్షల ప్యాకేజీ లభించే అవకాశం ఉంది.

వయసు పరిమితి :: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ మరియు ఓబిసి అలాగే పిడబ్ల్యుడి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానము :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అనేది నిర్వహించడం లేదు. కేవలం GATE-2025 లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. అలాగే ఎస్సీ/ ఎస్టీ మరియు దివ్యాంగులు మరియు మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీల వివరాలు :

ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యే తేదీ11 ఫిబ్రవరి 2026
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ25 ఫిబ్రవరి 2026
అధికారిక నోటిఫికేషన్View / Download
అధికారిక వెబ్సైట్View / Downloa

#NTPCRecruitment2026 #NTPCJobs #GovtJobs2026 #EngineeringJobs #ExecutiveTrainee #GATE2025 #NTPCEETNotification #MechanicalEngineeringJobs #ElectricalEngineeringJobs #LatestGovtNotifications #NTPCPayScale #NTPCCareers

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *