NVS Recruitment 2026: పీజీటీ, టీజీటీ మరియు నాన్-టీచింగ్ పోస్టులు | NVS Recruitment 2026 PDF

Navodaya Vidyalaya Samiti Recruitment Poster 2026
Navodaya Vidyalaya Samiti Recruitment Poster 2026 - Version 1 - 1

నవోదయ విద్యాలయ సమితి (NVS)లో బోధన (Teaching) మరియు బోధనేతర (Non-Teaching) విభాగాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి  నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఉద్యోగాల భర్తీకి ఏ ఏ పోస్టులకు ఏ అర్హతలు ఉండాలి, జీతం ఎంత ఉండాలి అనే నిబంధనలను సూచిస్తూ 11 ఫిబ్రవరి 2026 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం :

ఉద్యోగం పేరు ఖాళీల వివరాలు
PGT (Post Graduate Teacher)సంబంధిత సబ్జెక్టులో Post Graduation + B.Ed
TGT (Trained Graduate Teacher)సంబంధిత సబ్జెక్టులో Graduation + B.Ed + CTET క్వాలిఫై అవ్వాలి
PrincipalMaster’s Degree + B.Ed + 15 ఏళ్ల టీచింగ్ అనుభవం
LibrarianLibrary Scienceలో డిగ్రీ
JSA (Junior Secretariat Assistant)12వ తరగతి (Inter) + టైపింగ్ నాలెడ్జ్
Lab Attendant10వ తరగతి లేదా 12వ తరగతి (Science)
Mess Helper / MTS10వ తరగతి ఉత్తీర్ణత

వయసు పరిమితి :

  • PGT (Post Graduate Teacher) – 40 ఏళ్లు
  • TGT (Trained Graduate Teacher) – 35 ఏళ్లు
  • Principal – 50 ఏళ్లు
  • Librarian – 35 ఏళ్లు
  • JSA (Junior Secretariat Assistant) – 27 ఏళ్లు
  • Lab Attendant – 30 ఏళ్లు
  • Mess Helper / MTS – 30 ఏళ్లు

SC/ST లకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్లు, మరియు మహిళలకు (టీచింగ్ పోస్టులకు) నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

జీతం & ఇతర అలవెన్సులు : ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి 7th Pay Commission ప్రకారం జీతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఉచిత వసతి (Quarters), భోజనం (కొన్ని పోస్టులకు), DA, HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

  • Principal: Level-12 (Rs. 78,800 – Rs. 2,09,200)
  • PGT: Rs. 47,600 – Rs. 1,51,100 (Level 8)
  • TGT: Rs. 44,900 – Rs. 1,42,400 (Level 7)
  • Non-Teaching: Rs. 19,900 నుంచి ప్రారంభమై పోస్టును బట్టి పెరుగుతుంది.

ఎంపిక విధానం (Selection Process) : నవోదయ విద్యాలయ సమితి (NVS) లోని ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ సాధారణంగా మూడు దశల్లో ఉంటుంది. ఇందులో కొన్ని పోస్టులు ప్రత్యక్ష నియామకం (Direct Recruitment) ద్వారా, మరికొన్ని ప్రమోషన్ మరియు లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా భర్తీ చేయబడతాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

  • CBT (Computer Based Test): ఆన్‌లైన్ రాత పరీక్ష. ఇందులో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, లాంగ్వేజ్ (తెలుగు/హిందీ/ఇంగ్లీష్), మరియు సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయి. ఈ ఆన్లైన్ పరీక్షను మూడు గంటల పాటు నిర్వహిస్తారు. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. ఇది ఆన్‌లైన్ (CBT – Computer Based Test) పద్ధతిలో జరుగుతుంది.
  • Interview / Skill Test: రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూ ఉంటుంది. టీచింగ్ పోస్టులకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. JSA వంటి పోస్టులకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
  • Document Verification: ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన.

1. టీజీటీ (TGT) పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది, కానీ మెరిట్ లిస్ట్ కోసం కేవలం 120 మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పార్ట్ 6 లో ప్రతి సబ్జెక్టులో కనీసం 40% మార్కులు (4 మార్కులు) సాధించాలి. లేకపోతే మీ మొదటి 5 పార్టుల పేపర్‌ను మూల్యాంకనం చేయరు.

విభాగము సంబంధిత అంశము మార్కులు
Part – 1జనరల్ అవేర్‌నెస్10 మార్కులు
Part – 2రీజనింగ్ ఎబిలిటీ10 మార్కులు
Part – 3నాలెడ్జ్ ఆఫ్ ICT (కంప్యూటర్స్)10 మార్కులు
Part – 4టీచింగ్ ఆప్టిట్యూడ్10 మార్కులు
Part – 5సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్కులు
Part – 6లాంగ్వేజ్ కాంపిటెన్సీ (అర్హత పరీక్ష) 30 మార్కులు

2. పీజీటీ (PGT) పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది, మెరిట్ కోసం 130 మార్కులను పరిగణిస్తారు. పార్ట్ 6 లో ప్రతి సబ్జెక్టులో కనీసం 40% మార్కులు (4 మార్కులు) సాధించాలి. లేకపోతే మీ మొదటి 5 పార్టుల పేపర్‌ను మూల్యాంకనం చేయరు.

విభాగము సంబంధిత అంశము మార్కులు
Part – 1జనరల్ అవేర్‌నెస్10 మార్కులు
Part – 2రీజనింగ్ ఎబిలిటీ20 మార్కులు
Part – 3నాలెడ్జ్ ఆఫ్ ICT (కంప్యూటర్స్)10 మార్కులు
Part – 4టీచింగ్ ఆప్టిట్యూడ్10 మార్కులు
Part – 5సబ్జెక్ట్ నాలెడ్జ్ 80 మార్కులు
Part – 6లాంగ్వేజ్ కాంపిటెన్సీ 30 మార్కులు

3. సిలబస్ వివరాలు (Syllabus Highlights):

  • జనరల్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్, దేశాలు-రాజధానులు, క్రీడలు, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, భారత రాజ్యాంగం.
  • రీజనింగ్: పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్.
  • నాలెడ్జ్ ఆఫ్ ICT: కంప్యూటర్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్ (Word, Excel, PPT), ఇంటర్నెట్ మరియు సైబర్ సెక్యూరిటీ.
  • టీచింగ్ ఆప్టిట్యూడ్: బోధనా పద్ధతులు, అభ్యసన ప్రక్రియలు, విద్యార్థుల మనస్తత్వశాస్త్రం.
  • సబ్జెక్ట్ నాలెడ్జ్: టీజీటీ (TGT) కి 10వ తరగతి వరకు మరియు పీజీటీ (PGT) కి ఇంటర్/డిగ్రీ/పీజీ స్థాయి వరకు సబ్జెక్ట్ లో పట్టు ఉండాలి (NCERT బుక్స్ చదవడం చాలా ఉత్తమం).

ముఖ్యమైన పాయింట్::: ఇది ఉద్యోగాలకోసం ఇచ్చిన దరకాస్తు ప్రకటన కాదు. అసలు ఖాళీలతో కూడిన నోటిఫికేషన్ మార్చి లేదా ఏప్రిల్ 2026 మధ్యన రావచ్చు. ఇలాంటి మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో పొందడానికి క్రింద ఇచ్చిన మా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అవండి. 

NVS #NavodayaJobs #TeacherJobs2026 #GovtJobsTelugu #EmploymentNews #NVSNotification #UdyogaVedika #PGT #TGT #JobSearchIndia

More FAQ :

Question: What is the NVS Recruitment 2026 Notification Date?

  • Answer: The NVS Revised Recruitment Rules were released on February 11, 2026. The official vacancy notification is expected soon.

Question: Is CTET mandatory for NVS TGT posts?

  • Answer: Yes, as per the new 2026 rules, CTET (Paper-II) is mandatory for TGT positions.

Question: What is the age limit for NVS PGT jobs?

  • Answer: The maximum age limit for PGT posts is 40 years, with relaxations for reserved categories.
షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *