Aadhaar Operator Jobs Recruitment 2026 -సొంత జిల్లాలోనే పని చేసే అవకాశం!

csc-aadhaar-jobs-apply-online
csc-aadhaar-jobs-apply-online

CSC e-Governance Services India Limited నుండి భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో కామన్ సర్వీస్ సెంటర్ ( CSC) ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్ / ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థుల తో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు సెమీ స్కిల్ కేటగిరీ కింద వేతనాలు అనేది చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 మార్చి 2026.

ఉద్యోగాల వివరాలు :: CSC e-Governance Services India Limited నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా 257 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 07 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

రాష్ట్రం పేరు జిల్లా పేరు ఖాళీల సంఖ్య
ఆంధ్ర ప్రదేశ్ప్రకాశం01 Post
ఆంధ్ర ప్రదేశ్గుంటూరు 01 Post
ఆంధ్ర ప్రదేశ్తిరుపతి 02 Posts
ఆంధ్ర ప్రదేశ్విశాఖపట్నం 01 Post
ఆంధ్ర ప్రదేశ్విజయనగరం01 Post
ఆంధ్ర ప్రదేశ్వైఎస్సార్ కడప01 Post
తెలంగాణఆసిఫాబాద్01 Post
తెలంగాణకరీంనగర్ 01 Post
తెలంగాణమహబూబ్ నగర్ 01 Post
తెలంగాణనాగర్ కర్నూల్01 Post
తెలంగాణనిర్మల్ జిల్లా01 Post
తెలంగాణపెద్దపల్లి 01 Post
తెలంగాణసంగారెడ్డి01 Post
తెలంగాణవనపర్తి 01 Post
తెలంగాణయాదాద్రి భువనగిరి01 Post
తెలంగాణనిజామాబాద్01 Post

విద్యార్హతలు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. లేదా పదవ తరగతి మాత్రమే అయితే పదవ తరగతితో పాటు రెండు సంవత్సరాల ఐటిఐ లేదా మూడు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు UIDAI ద్వారా గుర్తింపు పొందిన NSEIT సంస్థ నుంచి ఆధార ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే స్థానిక భాష పైన పట్టు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయసు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా వయస్సు పరిమితి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి గరిష్ట వయస్సు పరిమితి అంటూ ఏమీ లేదు

శాలరీల వివరాలు :: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సాధారణంగా సెమీ-స్కిల్డ్ కేటగిరీ కింద వేతనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వీళ్లు పనిచేసే రాష్ట్రం జిల్లా మరియు ఆ కేంద్రంలోని పని ఒత్తిడి పైన ఆధారపడి ఉంటుంది. వారికి సుమారుగా 20,000 నుంచి నెలకు 40,000 రూపాయల వరకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది

ఎంపిక విధానము:: ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది చాలా సరళంగా ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి వారి విద్య రాతలు మరియు ఆధార్ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక అనేది చేస్తారు దాంతోపాటు అప్డేట్ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు కొన్నిచోట్ల చిన్నపాటి ఇంటర్వ్యూ లేదా కంప్యూటర్ టెస్ట్ అనేది నిర్వహించే అవకాశం ఉంది.

UIDAI సర్టిఫికేషన్ పరీక్ష విధానము:: ముందుగా సూపర్వైజర్ లేదా ఆపరేటర్ గా పని చేయాలంటే NSEIT నిర్వహించే పరీక్ష అనేది పాస్ అవ్వాలి. ఈ పరీక్ష కోసం సుమారుగా 471 రూపాయలు GST తో కలిపి చెల్లించాలి. ఒకవేళ ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మరల రీ-టెస్ట్ కోసం మరల 235 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష అనేది సుమారుగా రెండు గంటలపాటు నిర్వహిస్తారు. ఇందులో 100 మల్టిపుల్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు కనీసం 65% మార్కులు సాధిస్తే సూపర్వైజర్ సర్టిఫికెట్ అనేది వస్తుంది. అంతకన్నా తక్కువగా మార్కులు వస్తే ఆపరేటర్ సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :: CSC e-Governance Services India Limited నుంచి విడుదలైన ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్లు సమకూర్చుకోవాలి.
పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, NSEIT నిర్వహించిన ఆధార్ సర్టిఫికెట్, అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు, లోకల్ రెసిడెన్స్ ప్రూఫ్ అనగా నివాస ధ్రువీకరణ పత్రం, దాంతోపాటు అభ్యర్థి ఎంపికైన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అనేది అడుగుతారు.

ముఖ్యమైన సమాచారం :

ప్రతి అడుగు మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరువ చేస్తుంది. నిరంతర కృషి, సరైన సమాచారం ఉంటే విజయం మీ సొంతం! మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని, ఈ ఉద్యోగ వేటలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! ఆల్ ది బెస్ట్!

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *