నిరుద్యోగులకు ఇది ఒక మంచి వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు మరియు పర్యవేక్షణ అందించేందుకు ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో (Hostels) విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం మరియు హాస్టల్ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచడం ఈ సిబ్బంది ప్రధాన బాధ్యత. ప్రస్తుతానికి ప్రభుత్వం మొత్తం 1,433 ఖాళీలను మంజూరు చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 17, 2026న అసెంబ్లీలో మంత్రి సవిత గారు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నియామకాలు జరగనున్నాయి. ఈ నియామకాలు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి, జిల్లాల వారీగా ఖాళీల వివరాలను జిల్లా సెలక్షన్ కమిటీ (DSC) లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం విడుదల చేస్తుంది. జిల్లాల వారీగా స్పష్టమైన గణాంకాలు అందిన తరువాత అధికారిక నోటిఫికేషన్ లేదా జిల్లాల వారీగా ఇచ్చే పేపర్ ప్రకటనల ద్వారా తెలుస్తాయి. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా లిస్టును అధికారికంగా విడుదల చేయలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కొన్ని జిల్లాలలో హాస్టళ్లు ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా ఖాళీలు (District-wise Vacancies) : ఫిబ్రవరి 17, 2026న అసెంబ్లీలో మంత్రి సవిత గారు ప్రకటించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1433 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే జిల్లాల వారీగా ఖాళీల అంచనాప్రస్తుతానికి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఖాళీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన చిన్న జిల్లాలు అంటే కోనసీమ, బాపట్ల వంటి జిల్లాలలో ఖాళీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒక ప్రాథమియా అంచనా ప్రకారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలలో 100-150 మధ్యన ఖాళీలు ఉంటాయి అలాగే మధ్యస్థ జిల్లాలు అయినా గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలలో 80-100 ఉద్యోగాలు, చిన్న జిల్లాలలో 50-80 మధ్య ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టళ్ల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు 60 నుండి 90 పోస్టులు ఉండవచ్చు.
జిల్లాల వారీగా హాస్టళ్ల సంఖ్యను బట్టి ఆయా సంక్షేమ శాఖలలో ఖాళీల అంచనా వివరాలు :
- బి.సి. సంక్షేమ శాఖ (BC Welfare) 700 – 800 ఉద్యోగాలు
- ఎస్.సి. సంక్షేమ శాఖ (SC Welfare) 400 – 500 ఉద్యోగాలు
- గిరిజన సంక్షేమ శాఖ (Tribal Welfare) 150 – 200 ఉద్యోగాలు
ఉద్యోగాల వివరాలు : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి త్వరలో వెలువడనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్ & లేబర్ మరియు పారిశుధ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : 1433 పోస్టులు
- ఖాళీల వివరాలు :
కుక్ & లేబర్ (Cook & Labor): 142 పోస్టులు - పారిశుద్ధ్య సిబ్బంది (Sanitation Staff & లేబర్): 1,291 పోస్టులు
- అర్హతలు (Qualifications) :
వంట మనిషి (Cook): 7వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత. పెద్ద మొత్తంలో వంట చేసిన అనుభవం (Experience) ఉండాలి. అభ్యర్థి అదే జిల్లాకు లేదా అదే నియోజకవర్గానికి చెందిన వారైతే ప్రాధాన్యత లభిస్తుంది. - పారిశుద్ధ్య సిబ్బంది: 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన వారు అర్హులు. రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అలాగే లేబర్ ఉద్యోగాలకు 7వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్నా ప్రాధాన్యత ఇస్తారు. శారీరక దారుఢ్యం ముఖ్యం. అభ్యర్థి అదే జిల్లాకు లేదా అదే నియోజకవర్గానికి చెందిన వారైతే ప్రాధాన్యత లభిస్తుంది.
వయస్సు: కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి (గరిష్ట వయస్సు నోటిఫికేషన్‌లో తెలుస్తుంది, సాధారణంగా 42 ఏళ్లు ఉంటుంది). ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ (Selection Process) : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి త్వరలో వెలువడనున్న ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలు అన్ని ఈ నియామకాలు ‘ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్డ్ సర్వీసెస్’ (APCOS) ద్వారా అవుట్‌సోర్సింగ్ (Outsourcing) పద్ధతిలో ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల ద్వారా భర్తీ చేయబడతాయి కాబట్టి, ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే కుక్ పోస్టులకు అయితే, ప్రాక్టికల్‌గా వంట వండించి చూసే అవకాశం ఉంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి ::: అభ్యర్థులు తమ జిల్లాలోని సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా APCOS (AP Corporation for Outsourced Services) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Official Website : View / Click Here
మా వెబ్‌సైట్/పేజీని సందర్శించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఉత్సాహం మరియు ఆసక్తి మాకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించడానికి స్ఫూర్తినిస్తాయి.
మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ముందుగా మీకు తెలియడానికి మా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవండి.
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.