ప్రఖ్యాత ఆన్లైన్ కంపెనీ అయిన మీషో (Meesho) కంపెనీలో ఇంటర్న్ – రిక్రూట్‌మెంట్ కోఆర్డినేటర్ (Intern – Recruitment Coordinator) ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి సంబంధించి బాధ్యతలు, అర్హతలు, జీతం, ఉద్యోగప్రయోజనాలు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
సంస్థ పేరు : మీషో
ఉద్యోగం పేరు :: ఇంటర్న్ – రిక్రూట్‌మెంట్ కోఆర్డినేటర్ (Intern – Recruitment Coordinator)
ఉద్యోగ విధులు : ఒక రిక్రూట్‌మెంట్ కోఆర్డినేటర్ ఇంటర్న్‌గా మీరు ప్రధానంగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది
- ఇంటర్వ్యూ షెడ్యూలింగ్: అభ్యర్థులకు (Candidates) మరియు ఇంటర్వ్యూ చేసే మేనేజర్ల మధ్య సమయాన్ని సర్దుబాటు చేస్తూ ఇంటర్వ్యూలను ప్లాన్ చేయడం.
- క్యాండిడేట్ మేనేజ్‌మెంట్: అభ్యర్థులకు కంపెనీ గురించి వివరించడం, వారి సందేహాలను తీర్చడం మరియు వారికి మంచి అనుభవాన్ని (Candidate Experience) అందించడం.
- డేటా అప్‌డేట్: అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ATS) లో అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం.
- కోఆర్డినేషన్: రిక్రూట్‌మెంట్ టీమ్‌కు కావాల్సిన డాక్యుమెంటేషన్ మరియు ఇతర అడ్మిన్ పనుల్లో సహాయం చేయడం.
విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (BBA, MBA – HR వారికి ప్రాధాన్యత ఉంటుంది). ఇంగ్లీష్ నైపుణ్యం, మరియు స్పష్టంగా మాట్లాడగలగటం మెయిల్స్ రాసే నైపుణ్యం (English) తప్పనిసరి. ఒకే సమయంలో ఎక్కువ పనులు అంటే మల్టి టాస్కింగ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు, వీటితో పాటు Google Calendar, MS Excel లేదా Google Sheets పై పట్టు ఉండాలి.
జీతం & అదనపు ప్రయోజనాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికీ మీషో నెలకు నెలకు Rs. 20,000 నుండి Rs.30,000 వరకు స్టైపెండ్ అందిస్తుంది. మీ పనితీరు బాగుంటే, పూర్తి స్థాయి ఉద్యోగిగా (Full-time employee) మారే అవకాశం కూడా ఉంటుంది.ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లభిస్తుంది.
ఇంటర్న్‌షిప్ వివరాలు:
- కాలవ్యవధి: 3 నుండి 6 నెలలు
- ప్రదేశం: బెంగళూరు (హైబ్రిడ్ లేదా ఆన్‌సైట్)
- స్టైపెండ్: కంపెనీ పాలసీ ప్రకారం
దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గాని లేదా మీషో అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Careers’ పేజీ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి, ఎందుకంటే మీషో ఉద్యోగాల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయదు.
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.