ప్రపంచ ప్రఖ్యాత ఆన్లైన్ కంపెనీ అయినటువంటి అమెజాన్ (Amazon) లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేయాలి అనుకునే అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అమెజాన్ (Amazon) వర్చువల్ కస్టమర్ సపోర్ట్ (VCS) ఉద్యోగానికి సంబంధించి లేటెస్ట్ (మార్చి 2026) అప్డేట్స్ మరియు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఉద్యోగం ముఖ్యంగా ఇంటి నుండి పని చేయాలనుకునే వారికి చాలా మంచి అవకాశం.
కంపెనీ పేరు : అమెజాన్ (Amazon)
ఉద్యోగం పేరు : వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్.
పని ప్రదేశం : పూర్తిస్థాయిలో ఇంటి నుండే పని (Permanent Remote). అంటే మీరు ఇంటి నుండే కంపెనీ యొక్క ఫోన్ మరియు ఇమెయిల్ లేదా చాట్ ద్వారా కస్టమర్ల యొక్క సందేహాలు లేదా సమస్యలు అంటే కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్లు, పేమెంట్స్ మరియు పార్సెల్ రిటర్న్ వంటి సమస్యలు పరిష్కరించడం.
విద్యార్హతలు : అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియేట్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఇంగ్లీష్ లో మాట్లాడటం మరియు రాయడం వచ్చి ఉండాలి. మీరు ఇంటి నుండి పని చేయాలి కాబట్టి, ఇంటర్నెట్ కనీసం 100 Mbps వేగం ఉండాలి. వైఫై (Wi-Fi) కంటే ఈథర్నెట్ కేబుల్ (LAN) కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. శబ్దం లేని ప్రశాంతమైన గది, ఒక టేబుల్ మరియు కుర్చీ ఉండాలి. అమెజాన్ సంస్థే మీకు ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్, హెడ్సెట్ మరియు పవర్ బ్యాకప్ (UPS) వంటివి ఉచితంగా అందిస్తుంది.
జీతం మరియు అదనపు ప్రయోజనాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 15,000 నుండి 25,000 వరకు ఉంటుంది (అనుభవం మరియు ప్రాంతాన్ని బట్టి మారుతుంది). ఇవే కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఓవర్ టైం పేమెంట్ మరియు ఇంటర్నెట్ బిల్లు రీయింబర్స్మెంట్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అమెజాన్ 24 గంటలు పనిచేస్తుంది, కాబట్టి మీకు రాత్రి షిఫ్టులు (Night Shifts) కూడా ఉండవచ్చు. ఇవి ప్రతి కొన్ని వారాలకు మారుతూ ఉంటాయి (Rotating Shifts). సాధారణంగా వారానికి 5 రోజులు పని ఉంటుంది (వారానికి 40 గంటలు). శని, ఆదివారాలు కూడా పని ఉండవచ్చు, బదులుగా వారంలో వేరే రోజుల్లో సెలవు ఇస్తారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ క్రింద రోజుకు సుమారు 150 రూపాయలు, ఇంటర్నెట్ అలవెన్స్ క్రింద నెలకు 1250 రూపాయలు మరియు మీల్ కార్డు క్రింద నెలకు 1100 రూపాయలు ఇస్తారు. ఒకవేళ మీరు ఓవర్ టైం అంటే అదనపు గంటలు పనిచేస్తే దానికి కూడా అదనపు చెల్లింపులు ఉంటాయి.
ఎంపిక విధానము: ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ అంతా పూర్తగా ఆన్లైన్ లోనే జరుగుతుంది. దీనిలో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి. రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, వర్సెన్ట్ టెస్ట్, వర్చువల్ జాబ్ సిమ్యులేషన్ చివరగా వీడియో ఇంటర్వ్యూ .
- రిజిస్ట్రేషన్: అమెజాన్ కెరీర్స్ పోర్టల్‌లో మీ వివరాలను నమోదు చేయడం.
- ఆన్లైన్ అసెస్మెంట్ (Test): ఇది అత్యంత కీలకమైన దశ. ఇందులో మీ ఇంగ్లీష్ మాట్లాడే మరియు వినే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
- వార్సెంట్ టెస్ట్ (Versant Test): మీ ఇంగ్లీష్ మాట్లాడే మరియు వినే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
- వర్చువల్ జాబ్ సిమ్యులేషన్: కస్టమర్ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారో కొన్ని కృత్రిమ పరిస్థితుల (Scenarios) ద్వారా పరీక్షిస్తారు.
- వర్క్ స్టైల్ అసెస్మెంట్: అమెజాన్ కంపెనీ సంస్కృతికి మీరు సరిపోతారా లేదా అని చూస్తారు.
- వీడియో ఇంటర్వ్యూ: అసెస్మెంట్ పాస్ అయిన వారికి చిన్న వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అమెజాన్ కంపెనీ ఎప్పుడు ఈ ఉద్యోగాల కోసం ఎప్పుడూ ఒక నిర్దిష్ట ‘చివరి తేదీ’ని ప్రకటించదు. అప్లికేషన్లు నిండగానే లింక్ క్లోజ్ చేస్తారు. కాబట్టి ఆసక్తి , అర్హతలు గల అభ్యర్థులు వెంటనే క్రింద ఇచ్చిన అధికారిక అమెజాన్ లింక్ ఓపెన్ చేసి అక్కడ “Virtual Customer Service” అని సెర్చ్ చేయండి. అందులో మీ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ పూర్తి చేయండి.
గమనిక (Warning): అమెజాన్ ఉద్యోగాల కోసం ఎప్పుడూ డబ్బులు అడగదు. ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమని గ్రహించండి.
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.