AP DSC Notification 2026

ap dsc notification 2026
నిరుద్యోగులకు శుభవార్త ఉగాదికి మరో DSC నోటిఫికేషన్ 3600 ఉద్యోగాలతో మరో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన శుభవార్త ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పినా కూటమి సర్కార్ ఈ ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరొక భారీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా మరొక ప్రత్యేకమైన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 36 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఉగాది సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఎంపికైన ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు

ఉద్యోగాల వివరాలు (ఎన్ని పోస్టులు? ఏయే విభాగాల్లో?) :: ఇప్పటివరకు అందిన అధికారిక వర్గాల సమాచారం ప్రకారం విడుదల కాబోయే డీఎస్సీ లో సుమారుగా 3600 ఉద్యోగాలు భర్తీ చేయడం గవర్నమెంట్ / పంచాయతీరాజ్ లేదా మున్సిపల్ స్కూల్లో సుమారుగా 1700 ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది ఇందులో ఎస్ జి టి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకులాలు మరియు మోడల్ స్కూల్ లో దాదాపు 1200 పోస్టులు ఉండే అవకాశం ఉంది ఇందులో పిజిటి, టిజిటి మరియు ప్రిన్సిపల్ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది ఇక చివరిగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయుల కోసం సుమారుగా 700 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా బట్టి చేసే అవకాశం ఉంది.

పాఠశాల విభాగంఖాళీల సంఖ్య
ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్లుసుమారు 1,700 పోస్టులు. (ఇందులో SGT మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి)
రెసిడెన్షియల్ (గురుకులాలు), ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలుదాదాపు 1,200 పోస్టులు. (PGT, TGT మరియు ప్రిన్సిపాల్ ఖాళీలు)
ప్రత్యేక విద్య (Special Education) పోస్టులుప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయుల కోసం సుమారు 700 పోస్టులు.
మొత్తం ఖాళీల సంఖ్య3600 ఖాళీల

విద్యార్హతలు మరియు వెయిటేజీ :: టెట్ వెయిటేజీ గతంలో లాగే 20% ఉంటుంది. ఇందులో డీఎస్సీ పరీక్షకు 80% వెయిటేజీ ఉంటుంది.

  • కాంట్రాక్టు టీచర్ వెయిటేజీ:: టీచర్ గా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు టీచర్లకు మరియు టెట్ క్వాలిఫై అయిన వారికి కొంత అదనపు వెయిటేజీని ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
  • భాషా ప్రావీణ్యం : మొదట ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ కొంతమంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరియు సమయాభావం వల్ల ఆ నిర్ణయాన్ని ప్రస్తుత డీఎస్సీలో వాయిదా వేయడం జరిగింది.

పరీక్ష విధానము మరియు సిలబస్:: ఈసారి విడుదల కాబోయే డీఎస్సీలో సిలబస్ లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీకి ఇచ్చిన సిలబస్ మరియు ఆ మార్గదర్శకాలతోనే ఈ పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అన్ని పోస్టులకు ఇంగ్లీష్ భాషా ప్రావీణ్య పరీక్ష మరియు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే వాటి నిర్వహణకు తగినంత సమయం లేకపోవడంతో ఈ ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది.

ముఖ్యమైన తేదీల వివరాలు::

నోటిఫికేషన్ విడుదల అయ్యే తేదీ19 మార్చి 2026 ఉగాది రోజున
పరీక్ష జరిగే తేదీఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజులలోపు పరీక్షల నిర్వహించి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి అంటే జూన్ నాటికి ఈ పూర్తి నియామక ప్రక్రియ అనేది విజయవంతంగా పూర్తి చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు

ప్రిపరేషన్ టిప్: నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షకు కేవలం 45 నుండి 60 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. కాబట్టి, నోటిఫికేషన్ కోసం వేచి చూడకుండా ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయడం ఉత్తమం.

ఇది చాలా మందికి బంగారు అవకాశం. కాబట్టి, అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. తాజా సమాచారం కోసం https://udyogavedika.com/ అనే వెబ్సైట్ను నిఘా ఉంచండి

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *