ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా అందులోనే పరీక్షా తేదీలు, ఫలితాల తేదీలు ఉద్యోగాల సంఖ్య , ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ ఉండబోతోంది అని వివరంగా టైం టేబుల్ లాగా ఉండబోతోంది. ఈ జాబ్ క్యాలెండర్ లో గతంలో కంటే బిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రభుత్వ వర్గాలు దీనిని వార్షిక ఉద్యోగ నియామక ప్రణాళిక అని పేర్కొంటున్నారు. పూర్తి పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్ విడుదల తేదీ, ప్రిలిమ్స్ లేదా మైన్స్ పరీక్షల తేదీలు, ఫలితాలు తేదీలను ముందే ఖరారు చేస్తారు.
| విడుదల తేదీ (అంచనా): ఈ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉగాది పండుగ రోజున అనగా 2026 మర్చి 19వతేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. |
| శాఖల వారీగా ఖాళీలు: ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖలలో సుమారుగా 99,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని 157 శాఖల నుండి ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, హోమ్ శాఖ తదితర ప్రభుత్వ శాఖలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. |
శాఖల వారీగా రాబోయే నోటిఫికేషన్లు :
| విభాగం (Department) | ఉద్యోగం వివరాలు | ఉద్యోగాల సంఖ్య (అంచనా ప్రకారం) |
| విద్యాశాఖ | ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్ టీచర్స్ | 16,000+ |
| హోమ్ శాఖ | సివిల్ కానిస్టేబుల్, ఎపిఎస్సి, ఎస్సై ఉద్యోగాలు | 6,500+ |
| వైద్య ఆరోగ్య శాఖ | స్టాఫ్ నర్స్ , సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎంపీహెచ్ఏ | 5,000+ |
| రెవెన్యూ శాఖ | వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్ | 2,000+ |
| పంచాయతీ రాజ్ | డిజిటల్ అసిస్టెంట్, సెక్రటరీ (గ్రేడ్ – V) | 4,000+ |
| అటవీ శాఖ | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ | 800+ |
| వయోపరిమితి సడలింపు: గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 5ఏళ్లుగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు, గరిష్ట వయోపరిమితిని 42 నుండి 44 ఏళ్లకు (BC/SC/STలకు మరో 5 ఏళ్ల అదనపు సడలింపు) పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. |
ప్రస్తుతం అన్ని శాఖల నుండి వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ బేరీజు వేస్తోంది. ఉగాది (మార్చి 19) నాటికి తుది ఆమోదం పొంది నిరుద్యోగుల ముందుకు రానుంది.
ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల ఫలితాలు మరియు కెరీర్ గైడెన్స్ కోసం ఉద్యోగ వేదిక వెబ్సైట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయ ప్రయాణంలో మేము తోడుంటాము.”
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.