ఏపీ ఆర్టీసీలో 7,673 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ – APSRTC Recruitment 2026 Official Update

APSRTC Recruitment 2026 notification for 7673 Driver, Conductor, and Mechanic posts in Andhra Pradesh.
APSRTC Recruitment 2026 notification for 7673 Driver, Conductor, and Mechanic posts in Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయం లో  నిర్వహించిన 10 ఫిబ్రవరి 2026  న నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనిపైనా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో 2020లో 51,488 మంది ఉండగా, ప్రస్తుతం 44,131 మంది మాత్రమే ఉన్నారు. రాబోయే 2026-28 మధ్య కాలంలో భారీగా ఉద్యోగులు రిటైర్ కానున్నారు. అలాగే 7,514 మంది ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను ఫిబ్రవరి 20, 2026 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తంగా ఇవి అన్ని పోను సుమారుగా 7,673 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు.  

ఉద్యోగాల వివరాలు (అంచనా ప్రకారం) :

పోస్టు పేరుఉద్యోగాల సంఖ్య
డ్రైవర్లు3,673
కండక్టర్లు1,813
మెకానిక్ & శ్రామిక్స్2,187
మొత్తం ఖాళీలు7,673

విద్యార్హతలు ::

పోస్టు పేరువిద్యార్హతఅర్హతలు
డ్రైవర్10వ తరగతిచెల్లుబాటు అయ్యే Heavy Transport Vehicle (HTV) లైసెన్స్.
కండక్టర్10వ తరగతి లేదా ఇంటర్మీడియట్కండక్టర్ లైసెన్స్ (నోటిఫికేషన్‌లో స్పష్టత వస్తుంది).
టెక్నికల్ స్టాఫ్ / మెకానిక్స్ITI / డిప్లొమాడీజిల్/మోటార్ మెకానిక్ వంటి సంబంధిత ట్రేడ్లలో సర్టిఫికేట్.

వయస్సు: కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు సాధారణంగా 35-42 ఏళ్ల మధ్య ఉంటుంది (BC/SC/ST అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి).

పోస్టుల వారీగా సిలబస్ మరియు పరీక్ష విధానము :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ అనేది ముఖ్యంగా మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ మరియు టెక్నికల్ అంటే మెకానిక్ పోస్టులకు సంబంధించి ఒక అంచనా ప్రకారం జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ట్రాఫిక్ రూల్స్ మరియు సేఫ్టీ అలాగే తెలుగు భాష పైన ప్రశ్నలు అనేవి రావచ్చు. జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర జియోగ్రఫీ వర్తమాన అంశాలు మరియు ముఖ్యమైన ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలు రావచ్చు అర్థమెటిక్ మరియు పర్సెంటేజెస్ సగటు నిష్పత్తి కోడింగ్ మరియు డి కోడింగ్ మరియు దిశలకు సంబంధించిన ప్రశ్నలు అనేది రావచ్చు. ఇక ట్రాఫిక్ రూల్స్ మరియు సేఫ్టీ విభాగంలో రోడ్డు సంకేతాలు ట్రాఫిక్ నిబంధనలు వాహన నిర్వహణ అంటే బేసిక్ రెహికల్ మెయింటెనెన్స్ మరియు రావచ్చు ప్రథమ చికిత్స కి సంబంధించి ప్రశ్నలు అనేవి రావచ్చు.

టెక్నికల్ స్టాఫ్ అంటే మెకానిక్స్ లేదా సంబంధించి సిలబస్ విషయానికి వస్తే ఐటిఐ లేదా డిప్లొమా అర్హత ఉన్న పోస్టులకు వారి సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో ట్రేడ్ థియరీ ఇంజన్ మెకానిజం వర్క్ షాప్ క్యాలిక్యులేషన్ సంబంధించి ప్రశ్నలు అనేవి రావచ్చు. ఇందులో ట్రేడ్ థియరీ కి సంబంధించి డీజిల్ మెకానిమెకానిక్, మోటార్ మెకానిక్, Fitter లేదా ఎలక్ట్రిషన్ ట్రేడ్లలో ప్రాథమిక సూత్రాలు, రెండవ భాగం ఇంజన్ మెకానిజంలో ఇంటర్నల్ కమిషన్ ఇంజన్, గేర్ బాక్స్, బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్ అనేది రావచ్చు. చివరగా వర్క్ షాప్ క్యాలిక్యులేషన్ లో కొలతలు యూనిట్లు మరియు టెక్నికల్ ట్రైన్స్ కు సంబంధించి ప్రశ్నలు రావచ్చు.

పరీక్ష విధానము : సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోని ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా సరళి ఈ క్రింది విధంగా ఉండవచ్చు. మొత్తం ప్రశ్నాపత్రం వంద మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో పూర్తిగా మల్టీప్లెక్స్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఈ ప్రశ్న పత్రాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే నిర్వహిస్తారు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :: నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవలసిన పత్రాలు విషయానికి వస్తే

  1. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ మార్క్ లిస్ట్
  2. ఆధార్ కార్డ్
  3. క్యాస్ట్ సర్టిఫికెట్
  4. డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు డ్రైవింగ్ లైసెన్స్
  5. Passport Size Photo మరియు సంతకం స్కాన్ కాఫీ

జీతభత్యాలు మరియు ప్రయోజనాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగాలు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రభుత్వం స్కేల్ ప్రకారం జీతం డి ఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్ లభిస్తాయి. ఉద్యోగ భద్రతతో పాటు ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యమైన గమనిక: ప్రస్తుతం 7,673 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు (Proposals) మాత్రమే సిద్ధమయ్యాయి. నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైనప్పుడు, అందులో సిలబస్‌లో ఏవైనా మార్పులు ఉంటే స్పష్టంగా తెలుస్తుంది.

నోటిఫికేషన్ ఎప్పుడు?: ప్రభుత్వం నుండి అధికారిక ఆమోదం లభించిన వెంటనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడుతుంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు మా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అవండి. ప్రతి రోజు లేటెస్ట్ ఉద్యోగ సమాచారం ఉచితంగా పొందండి.

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *