ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ‘ఎంప్లాయిమెంట్ న్యూస్’ (Employment News) లేదా ‘రోజ్‌గార్ సమాచార్’ ఒక దిక్సూచి వంటిది. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లికేషన్స్ డివిజన్ ద్వారా ప్రచురించబడే వారపత్రిక. ఇది ప్రతి వారం శనివారం రోజున విడుదలవుతుంది. ఇది ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ పత్రిక విశేషం ఏమిటంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ (Fake) నోటిఫికేషన్ల వల్ల అభ్యర్థులు తరచుగా మోసపోతుంటారు. కానీ, ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో వచ్చే ప్రతి ప్రకటన అధికారికమైనది. ప్రభుత్వం ద్వారా ధృవీకరించబడిన ఖాళీలను మాత్రమే ఇందులో ప్రచురిస్తారు. కాబట్టే ఈ పత్రికకు ఇంతటి ఆదరణ లభిస్తోంది.
ఇందులో కేవలం ఉద్యోగ ప్రకటనలే కాకుండా, విద్యార్థులకు ఉపయోగపడే విద్య అవకాశాలు అంటే దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ లలో జరిగే అడ్మిషన్లు, అందించే స్కాలర్షిప్ ల వివరాలు, మరియు వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు, పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, అందులో ఎలా విజయం సాదించాలి అనే అంశాలపైన ప్రముఖ నిపుణుల సలహాలు, సూచనలు ఇలాంటి అంశాలు ఇందులో ఉంటాయి.
ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోండి
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.