HPCL 739 జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2026: పూర్తి వివరాలు ఇక్కడ!

HPCL 739 Jobs Notification
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2026 సంవత్సరానికి గాను మొత్తం 732 కంటే ఎక్కువ ఖాళీల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి మరియు అదనపు సమాచారం ఇక్కడ ఉంది

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. 2026 సంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 739 జూనియర్ ఎగ్జిక్యూటివ్‌, ఇంజినీర్‌, ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబందిత అంశం వివరాలు
సంస్థ పేరుహిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
ఉద్యోగాల వివరాలుఇంజనీర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ తదితరాలు)
మొత్తం ఖాళీలు739 ఖాళీలు
అర్హతలుసంబంధిత సబ్జెక్టుల్లో 60% మార్కులతో (SC/ST/PwBD కి 50%) ఇంజనీరింగ్ డిగ్రీ (Full-time BE/B.Tech) లేదా గ్రాడ్యుయేషన్.
వయసు పరిమితిపోస్టును బట్టి 25 నుండి 30 ఏళ్ల వరకు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).

మొత్తం పోస్టుల్లో మెకానికల్ ఇంజనీర్ 72 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 37 పోస్టులు, సివిల్ ఇంజనీర్ 17 పోస్టులు, కెమికల్ ఇంజనీర్ 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. అనుభవం ఉన్న వారిని సీబీజీ ఆపరేషన్స్, సేఫ్టీ, సేల్స్, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టుల్లో భర్తీ చేస్తారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఫైనాన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ వంటి విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 25, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష మే 3, 2026న నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.2,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ (Selection Process) : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో ని ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ అనేది మొత్తం నాలుగు దశలలో ఉంటుంది. మొదట అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికీ గ్రూప్ టాస్క్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎక్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం (Exam Pattern) : HPCL ఈ పోస్టుల కోసం మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి. ఇది రెండు భాగాలుగా ఉంటుంది.

సబ్జెక్ట్ అంశాల వివరాలు
General Aptitudeఇందులో ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ మరియు డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఉంటాయి.
Technical Knowledgeఅభ్యర్థి చదివిన సబ్జెక్టుకు (కోర్ బ్రాంచ్) సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉత్తీర్ణులైన వారికీ గ్రూప్ టాస్క్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి. చివరగా మెడికల్ ఎక్జామినేషన్ తనిఖీ చేస్తారు.

  • గ్రూప్ టాస్క్ (Group Task): అభ్యర్థుల కమ్యూనికేషన్ మరియు టీమ్ వర్క్ నైపుణ్యాలను పరీక్షిస్తారు.
  • పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview): తుది ఎంపిక కోసం వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • మెడికల్ ఎగ్జామినేషన్: ఫిట్‌నెస్ ప్రమాణాలను తనిఖీ చేస్తారు.

దరఖాస్తు విధానం :: ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, మీ అర్హతలను సరిచూసుకోవడం మంచిది. ముఖ్యంగా దరఖాస్తు గడువు ముగియక ముందే ప్రాసెస్ పూర్తి చేయండి. అభ్యర్థులు HPCL అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com లో ‘Careers’ సెక్షన్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *