KVB Recruitment 2026: పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online Now

కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ఎటువంటి రాత పరీక్ష (No Exam) లేకుండా కేవలం షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి  ఉద్యోగాల వివరాలు, ఎంపిక విధానం, ఫీజు, ఉద్యోగ బాధ్యతలు ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సంస్థ పేరు :   కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) 

ఖాళీల వివరాలు  :  ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 251 పోస్టులు భర్తీ చేస్తున్నారు:

  • బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (BDE): 236 పోస్టులు (వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భర్తీ చేస్తారు).
  • ఎగ్జిక్యూటివ్ (కాల్ సెంటర్): 15 పోస్టులు (వీటికి జాబ్ లొకేషన్ చెన్నైలో ఉంటుంది).

ఉద్యోగ బాధ్యతలు (Job Role) : మీరు ఏ పోస్ట్‌కు ఎంపికవుతారో దానిని బట్టి పనులు ఇలా ఉంటాయి. ఇది ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం కాబట్టి, సేల్స్ టార్గెట్లు మరియు ఫీల్డ్ వర్క్ (ముఖ్యంగా BDE పోస్టులకు) ఉండే అవకాశం ఉంటుంది.

  • Business Development Executive (బిజినెస్ డెవలప్‌మెంట్): మీరు బ్యాంక్ కస్టమర్లను కలవాల్సి ఉంటుంది. లోన్లు (Loans), క్రెడిట్ కార్డ్‌లు, ఇన్సూరెన్స్ మరియు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించడం వంటి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఫీల్డ్ వర్క్‌తో కూడుకున్నది.
  • Call Center Executive (కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్): కస్టమర్ల సమస్యలను ఫోన్ ద్వారా పరిష్కరించడం, బ్యాంక్ సర్వీసుల గురించి వివరించడం వంటి ఆఫీస్ వర్క్ ఉంటుంది. దీనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

ఉద్యోగ బాధ్యతలు (Job Role)  :  మీరు ఏ పోస్ట్‌కు ఎంపికవుతారో దానిని బట్టి పనులు ఇలా ఉంటాయి. ఇది ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం కాబట్టి, సేల్స్ టార్గెట్లు మరియు ఫీల్డ్ వర్క్ (ముఖ్యంగా BDE పోస్టులకు) ఉండే అవకాశం ఉంటుంది. 

  • Business Development Executive  (బిజినెస్ డెవలప్‌మెంట్): మీరు బ్యాంక్ కస్టమర్లను కలవాల్సి ఉంటుంది. లోన్లు (Loans), క్రెడిట్ కార్డ్‌లు, ఇన్సూరెన్స్ మరియు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించడం వంటి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఫీల్డ్ వర్క్‌తో కూడుకున్నది.
  • Call Center Executive (కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్): కస్టమర్ల సమస్యలను ఫోన్ ద్వారా పరిష్కరించడం, బ్యాంక్ సర్వీసుల గురించి వివరించడం వంటి ఆఫీస్ వర్క్ ఉంటుంది. దీనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

KVB Recruitment 2026 అర్హతలు   :  కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు విద్యార్హతలు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (Any Graduate) ఉత్తీర్ణత పొంది ఉండాలి. Business Development Executive ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం బ్యాంకింగ్ రంగం లో కనీసం ఒకటి నుండి 04 సంవత్సరాల అనుభవం ఉండాలి. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

KVB Recruitment 2026 వయోపరిమితి: కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే  అభ్యర్థులకు వయసు గరిష్టంగా 32 ఏళ్లు మించకూడదు.

KVB Recruitment 2026 జీతం వివరాలు (Salary & Benefits) ::   కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎంపికైన వారికి బ్యాంక్ నిబంధనల ప్రకారం జీతం ఉంటుంది.

  • బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (BDE): వీరికి నెలకు సుమారుగా Rs. 20,000 నుండి Rs. 30,000 వరకు ప్రారంభ వేతనం ఉండవచ్చు. దీంతో పాటు సేల్స్ టార్గెట్స్ పూర్తి చేస్తే అదనపు ఇన్సెంటివ్స్ (Incentives) లభిస్తాయి.
  • కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్: వీరికి నెలకు Rs.18,000 నుండి Rs.25,000 వరకు జీతం లభించే అవకాశం ఉంది.

ఫీజు: ఈ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు (No Application Fee) చెల్లించవలసిన అవసరం లేదు.

KVB Recruitment 2026 ఎంపిక విధానం (Selection Process) :: ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎంపిక కేవలం రెండు దశల్లో ఉంటుంది.

  • షార్ట్‌లిస్టింగ్: మీరు పంపిన దరఖాస్తులు, మీ అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • పర్సనల్ ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగం లభిస్తుంది.

KVB Recruitment 2026 దరఖాస్తు ప్రక్రియ  :: ముందుగా KVB అధికారిక కెరీర్ పోర్టల్ కి వెళ్ళండి. అక్కడ ఉన్న నోటిఫికేషన్లలో మీ విద్యార్హతకు సరిపోయే పోస్ట్‌ను క్లిక్ చేయండి.“Apply Online” బటన్ మీద నొక్కి మీ వివరాలను (పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్) నమోదు చేయండి. మీ లేటెస్ట్ Resume (Bio-data) అప్‌లోడ్ చేయండి. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఐడిని సేవ్ చేసుకోండి.

అవసరమైన డాక్యుమెంట్లు (Required Documents):: ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఇవి సిద్ధంగా ఉంచుకోండి.

  • విద్యార్హత పత్రాలు: 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మార్క్స్ మెమోలు/ప్రొవిజనల్ సర్టిఫికెట్లు.
  • అనుభవ ధృవీకరణ పత్రం: గతంలో చేసిన ఉద్యోగం తాలూకు ‘Experience Letter’ లేదా ‘Relieving Letter’.
  • గుర్తింపు కార్డులు: ఆధార్ కార్డ్ (Aadhar), పాన్ కార్డ్ (PAN Card).
  • ఫోటోలు: పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *