నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPC నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 ఫిబ్రవరి 2026. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం గేట్ 2025లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది.
ఉద్యోగాలు వివరాలు ::
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చేయగల వివరాలు
| ఉద్యోగ వివరాలు | మొత్తం ఖాళీలు |
| ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 165 |
| మెకానికల్ ఇంజనీరింగ్ | 210 |
| ఎలక్ట్రిషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ | 125 |
| కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ | 15 |
విద్యార్హతలు :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ లేదా మైనింగ్ విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పాసై ఉండాలి. అభ్యర్థికి కనీసం 65% మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ మరియు PWD అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉండాలి. అలాగే గేట్ 2025లో మంచి స్కోర్ వచ్చి ఉండాలి.
జీతం మరియు ఇతర ప్రయోజనాలు: : నెలకు 40,000 నుంచి 1,40,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లించడం జరుగుతుంది. DA, HRA, మెడికల్ సదుపాయాలు మరియు ఇతర అలవెన్సులు కలిపి ఏడాదికి దాదాపు Rs. 12-15 లక్షల ప్యాకేజీ లభించే అవకాశం ఉంది.
వయసు పరిమితి :: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ మరియు ఓబిసి అలాగే పిడబ్ల్యుడి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానము :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అనేది నిర్వహించడం లేదు. కేవలం GATE-2025 లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. అలాగే ఎస్సీ/ ఎస్టీ మరియు దివ్యాంగులు మరియు మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీల వివరాలు :
| ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యే తేదీ | 11 ఫిబ్రవరి 2026 |
| ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 25 ఫిబ్రవరి 2026 |
| అధికారిక నోటిఫికేషన్ | View / Download |
| అధికారిక వెబ్సైట్ | View / Downloa |
#NTPCRecruitment2026 #NTPCJobs #GovtJobs2026 #EngineeringJobs #ExecutiveTrainee #GATE2025 #NTPCEETNotification #MechanicalEngineeringJobs #ElectricalEngineeringJobs #LatestGovtNotifications #NTPCPayScale #NTPCCareers
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.