PNB Apprentice Recruitment 2026: 5138 ఖాళీలు.. ఏపీ, తెలంగాణలో ఉద్యోగాలు, అర్హతలు మరియు ఎలా అప్లై చేయాలి?

PNB Apprentice Recruitment 2026 Telugu

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రస్తుతం భారీ స్థాయిలో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఖాళీల వివరాలు, అర్హతలు, జీతం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం తదితర సమాచారం ఇక్కడ ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చదవండి. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు, అప్రెంటిస్ ఉద్యోగాలు మాత్రమే అంటే ఇలా అప్రెంటిస్ పూర్తి చేసిన వారికీ సర్టిఫికెట్ ఇస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాంక్ పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల అయితే అప్పుడు వీరికి ప్రాధాన్యత అంటే వెయిటేజీ అనేది ఉంటుంది. ఏది ఏమైనా బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటె ఇది కూడా వారికీ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయితే 1 సంవత్సరపు contractual apprenticeship training ఇస్తారు; ట్రెనింగ్ పూర్తి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తారు — ఇది భవిష్యత్తులో బ్యాంకింగ్ ఎంపికల్లో వెయిటేజ్/బెనెఫిట్‌కి ఉపయోగపడుతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 5,138 ఖాళీలు ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లోని ఖాళీలు ఇలా ఉన్నాయి:

  • తెలంగాణ: 69 పోస్టులు
  • ఆంధ్రప్రదేశ్: 56 పోస్టులు

అర్హతలు (Eligibility) విద్యార్హత : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)విడుదలైన ఈ నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. అలాగే తెలుగు రాష్ట్రాలలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అభ్యర్థులకు స్థానిక భాష (తెలుగు) చదవడం, రాయడం మరియు మాట్లాడటం తెలిసి ఉండాలి.

ముఖ్య గమనిక :: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తేదీ 4 సంవత్సరాలకు ఎక్కువగా ఉండకూడదు (అంటే ఫోర్ ఇయర్స్ పూర్తి అయి ఉన్నవారు అర్హులే కాదు).

వయస్సు పరిమితి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01 జనవరి 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి (01-01-2026 నాటికి). అలాగే SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, PWBD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయసు పరిమితిలో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము (Application Fee) :: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నోటిఫికేషన్ లోని అప్రెంటిస్ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు దరకాస్తు ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి .

  • జనరల్/OBC/EWS (పురుషులు): Rs. 944
  • జనరల్/OBC/EWS (మహిళలు): Rs. 708
  • SC/ST/PWBD/ట్రాన్స్‌జెండర్స్: Rs. 236

స్టైఫండ్ & శిక్షణ (Stipend & Training) :: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోని అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ వేతనం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. వారికీ ఒక సంవత్సరం పాటు స్టైఫండ్ అనేది చెల్లిస్తారు. ఇది గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారికి 12,300/- మెట్రో నగరాలలో పనిచేసే వారికీ 15,000/- రూపాయలు స్టైఫండ్ గా ఒక సంవత్సరం పాటు చెల్లిస్తారు.

ఎంపిక విధానం (Selection Process) : పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక ముఖ్యంగా మూడు దశలలో ఉంటుంది. మొదట ఆన్లైన్ పరీక్షా అనేది నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో (CBT) జరుగుతుంది. దీనిని ఒక గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు (0.25) మార్కు కోత విధించబడుతుంది. ఈ పరీక్షను కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తెలుగు భాషా పరీక్ష నిర్వహిస్తారు. 10వ తరగతి లేదా 12వ తరగతి మార్క్ లిస్ట్‌లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉన్నవారికి ఈ పరీక్ష నుండి మినహాయింపు ఉండే అవకాశం ఉంది.

పరీక్షా విధానము : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)విడుదలైన ఈ నోటిఫికేషన్లోని అప్రెంటిస్ ఉద్యోగాలకు నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామినేషన్ లో అంశాలు, ప్రశ్నలు, మార్కులు క్రింద ఇవ్వబడ్డాయి.

సెక్షన్ (Subject)ప్రశ్నల సంఖ్యమార్కులు
General/Financial Awareness 25 ప్రశ్నలు25 మార్కులు
General English25 ప్రశ్నలు25 మార్కులు
Quantitative & Reasoning Aptitude25 ప్రశ్నలు25 మార్కులు
Computer Knowledge25 ప్రశ్నలు25 మార్కులు
మొత్తం100 ప్రశ్నలు100 మార్కులు

సిలబస్ లోని ముఖ్యమైన అంశాలు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్షలో జనరల్ / ఫైనాన్సియల్ అవేర్నెస్ , క్వాంటిటేటివ్, రీసోనింగ్ & ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ , కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

  • General/Financial Awareness: కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ మరియు ఎకానమీ.
  • Quantitative & Reasoning Aptitude: నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, సింపుల్ & కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ & వర్క్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ (DI), పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, కోడింగ్-డీకోడింగ్.
  • General English: రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్.
  • Computer Knowledge: కంప్యూటర్ హిస్టరీ, హార్డ్‌వేర్ & సాఫ్ట్‌వేర్, MS ఆఫీస్ (Word, Excel, PPT), ఇంటర్నెట్ మరియు నెట్‌వర్కింగ్ బేసిక్స్.

ముఖ్యమైన తేదీల వివరాలు :

  • అధికారిక వెబ్‌సైట్: pnbindia.in
  • దరఖాస్తు లింక్: bfsissc.com/apprentice-pnb26.php
  • దరఖాస్తులు ప్రారంభం : 08 ఫిబ్రవరి 2026
  • చివరి తేదీ : 24 ఫిబ్రవరి 2026
  • ఆన్లైన్ పరీక్షా తేదీ : మర్చి 2026 మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.
షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *