కేవలం పదవతరగతి పాస్ అయి ఉండి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. మీ సొంత ఊరిలో… గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు భారతీయ రైల్వే లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22,000 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాక్ మైంటెనర్ – గ్రేడ్ – IV , హెల్పర్ / అసిస్టెంట్ మరియు పాయింట్స్ మెన్ వంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు కేవలం పదవతరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులు అందరు సికింద్రాబాద్ జోన్ కు ఎక్కువగా అప్లై చేసుకుంటారు. కాబట్టి అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు కాంపిటీషన్ తక్కువగా ఉన్న జోన్ ను ఎంపిక చేసుకుంటే ఉద్యోగం పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
| RRB Group D రిక్రూట్మెంట్ 2026 – ముఖ్యాంశాలు: మొత్తం ఖాళీలు: సుమారు 22,000 (భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో). |
అర్హతలు : ఈ ఉద్యోగాలకు మీరు పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేయాల్సిన అవసరం లేదు కేవలం పదవతరగతి ఉత్తీర్ణత మరియు ఐటిఐ పాస్ అయి ఉంటె చాలు. మీరు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు అప్లై చేసుకుని భారతీయ రైల్వే లో ఉద్యోగం పొందవచ్చు. అయితే ఐటిఐ అనేది కేవలం కొన్ని విభాగాలలో ఉద్యోగాలకు మాత్రమే అవసరం, అంటే మొత్తం మీద ఈ ఉద్యోగాలు అన్ని కేవలం కేవలం 10వ తరగతి అర్హతతో నెలకు 30 వేల రూపాయల వరకు జీతం పొందే అద్భుతమైన అవకాశం ఇది.
వయోపరిమితి (Age Limit): సాధారణంగా అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. 18 నుండి 33 ఏళ్లు. (SC/ST లకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది).అంటే వయస్సు విషయంలో కూడా కంగారు పడకండి.. రిజర్వేషన్ ఉన్నవారికి 38 ఏళ్ల వరకు కూడా అవకాశం ఉంది!
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎంపిక మొత్తం మూడు దశలలో ఉంటుంది.
- Computer Based Test
- Physical Efficiency Test – PET
- Document Verification & Medical Examination
పరీక్షా విధానం (Exam Pattern) : దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాలలో జరిగే ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రాత పరీక్షకు మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను 90 నిమిషాలపాటు నిర్వహిస్తారు. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు.
| సబ్జెక్టు వివరాలు | మార్కులు |
| జనరల్ సైన్స్ (Physics, Chemistry, Biology) | 25 మార్కులు |
| మ్యాథమెటిక్స్ (Arithmetic/Basic Algebra) | 25 మార్కులు |
| రీజనింగ్ (General Intelligence) | 30 మార్కులు |
| కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్నెస్ | 20 మార్కులు |
శారీరక సామర్థ్య పరీక్ష (Physical Efficiency Test – PET) : రాత పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు ఈ శారీరక సామర్థ్య పరీక్ష (Physical Efficiency Test – PET) నిర్వహిస్తారు.
| పురుషులు | మహిళలు |
| 35 కిలోల బరువును ఎత్తుకుని, 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పరుగెత్తాలి. | 20 కిలోల బరువును ఎత్తుకుని, 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 40 సెకన్లలో పరుగెత్తాలి. |
అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు (Documents Checklist) : ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి దరఖాస్తు చేసుకునే సమయంలో పోర్టల్ లో అప్లోడ్ చేయడానికి ముందుగా క్రింద తెలిపిన పత్రాలు ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి ..
| ఆధార్ కార్డు (మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి). |
| 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ కోసం). |
| క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/OBC/EWS రిజర్వేషన్ పొందడానికి). |
| పాస్పోర్ట్ సైజ్ ఫోటో (వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంటే మంచిది) |
| డిజిటల్ సంతకం (Signature Photo) |
ముఖ్యమైన తేదీలు:
| అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల | ఫిబ్రవరి 15 – 18, 2026 మధ్య ఆశించవచ్చు |
| ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం | ఫిబ్రవరి 20, 2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ: | మార్చి 20, 2026 (అంచనా |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఫిబ్రవరి 20, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది. మీరు ఏ జోన్కు అప్లై చేస్తున్నారో కామెంట్ చేయండి”
ముఖ్య గమనిక: మీ మిత్రులకు, వాట్సాప్ గ్రూపులకు తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది!
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:
WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు
మంది చూశారు.