TS Agriculture Department: రాత పరీక్ష లేకుండా 10,909 వాలంటీర్ పోస్టుల భర్తీ

తెలంగాణ పంటల నమోదు సర్వే (Crop Booking) - 10,909 వాలంటీర్ పోస్టుల భర్తీ
తెలంగాణ పంటల నమోదు సర్వే (Crop Booking) - 10,909 వాలంటీర్ పోస్టుల భర్తీ

తెలంగాణ వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటల నమోదు సర్వే (Crop Booking Survey) కోసం వాలంటీర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తోంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,909 గ్రామాలకు గ్రామానికి ఒక వాలంటీర్ ను నియమించడానికి నిర్ణయించుకుంది. ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు కేవలం యాసంగి సీజన్ అయిపోయే వరకు అంటే 45 రోజుల కాల పరిమితితో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అంటే ఇవి కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ముఖ్యమైన వివరాలు: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,909 గ్రామాలలో పంటల నమోదు సర్వ్ చేయడం మరియు పొలాల ఫోటోలను తీసి వాటిని అప్లోడ్ చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ వాలంటీర్ లను నియమించుకోవాలని నిర్ణయించింది.

విభాగం పేరు :: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఉద్యోగం పేరు : వ్యవసాయ వాలంటీర్

మొత్తం ఖాళీలు: 10,909 పోస్టులు (రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమిస్తారు).

చేయవలసిన పని ఏమిటి : పంటల నమోదు సర్వే చేయడం మరియు పొలాల ఫోటోలను తీసి అప్‌లోడ్ చేయడం.

పని కాలం: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తోంది కాబట్టి 45 రోజుల పాటు (యాసంగి సీజన్). యాసంగి సీజన్ అయిపోయే వరకు అంటే 45 రోజుల కాల పరిమితితో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వేతనం: ఒక్కో ఫోటోకు రూ. 7 నుండి రూ. 10 వరకు చెల్లిస్తారు (గరిష్టంగా 2000 ఫోటోలు).

విద్యార్హత: 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది.

చెల్లింపులు (వేతనం) :: ఇది నెలవారీ జీతం కాదు, ఈ 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు తీసే ఫోటోల ఆధారంగా నగదు చెల్లిస్తారు. ఒక్కో ఫోటోకు రూ. 7 నుండి రూ. 10 వరకు చెల్లిస్తారు.

కావలసిన పత్రాలు: మీ విద్యార్హత పత్రాలు (10th, ఇంటర్ లేదా డిగ్రీ సర్టిఫికెట్లు) వెంట తీసుకెళ్ళాలి.

దరఖాస్తు విధానం : ఆసక్తి , అర్హతలు కలిగిన తెలంగాణ గ్రామాలకు చెందిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్ తో మీ దగ్గరలోకి మండల వ్యవసాయ శాఖ అధికారిని (MAO – Mandal Agriculture Officers) నేరుగా సంప్రదించి వారి కార్యాలయంలో దరకాస్తు చేసుకోవాలి.

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *