Indian Army Agniveer Recruitment 2026: ఆర్మీలో ఉద్యోగాల జాతర! పూర్తి నోటిఫికేషన్, అర్హతలు మరియు సెలక్షన్ ప్రాసెస్ వివరాలు ఇవే!

Indian Army Agniveer Recruitment 2026

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇండియన్ ఆర్మీలో అగ్నిపర్తి పథకం కింద 2027 నియామక సంవత్సరానికి సంబంధించి అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 13 ఫిబ్రవరి 2026 నుంచి 01 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ విభాగంలో అగ్నివీర్, మరియు టెక్నికల్ విభాగంలో అగ్ని వీర్, అగ్ని వీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ , ట్రేడ్స్ మెన్ విభాగంలో అగ్ని వీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు : జనరల్ డ్యూటీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతిలో కనీసం 40% మార్కులు మరియు కనీసం ఐదు సబ్జెక్టులలో ప్రతిదానిలో కనీసం 33% మార్కులు సాధించి ఉండాలి. టెక్నికల్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు సైన్స్ లో ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులలో కనీసం 50% ఏదైనా మార్కులతో పాస్ సాధించి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్య బోర్డు లేదా కేంద్ర విద్యా బోర్డు నుంచి భౌతికశాస్త్రం గణితం మరియు ఇంగ్లీష్ సైన్స్ లలో కనీసం 50% మార్కులతో ఉండాలి. క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్ కామర్స్ సైన్స్ పద్ధతులుగా ఇంటర్మీడియట్ పరీక్షలు కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి మరియు ప్రతి సబ్జెక్ట్ లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8 వతరగతి లేదా 10 వతరగతి పాస్ అయి ఉండాలి వీటిలో కనీసం 5 సబ్జెక్టులలో 33% మార్కులు సాధించి ఉండాలి.

ఉద్యోగం పేరు అర్హతలు వయసు
అగ్నివీర్ GD (General Duty)10వ తరగతి (45% మార్కులతో)17.5 – 21 ఏళ్లు
అగ్నివీర్ టెక్నికల్10+2 (MPC – 50% మార్కులతో)17.5 – 21 ఏళ్లు
అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్10+2 (ఏ స్ట్రీమ్ అయినా – 60% మార్కులతో)17.5 – 21 ఏళ్లు
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత17.5 – 21 ఏళ్లు

వయసు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి కనీసం 17 సంవత్సరాల ఆరు నెలల నుండి గరిష్టంగా 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు అక్టోబర్ 01, 2005 మరియు ఏప్రిల్ 01, 2009 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు :: ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాలు కాలానికి సేవ నిధి ప్యాకేజీ కింద వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు జమ చేసిన ఫ్రెండ్ మరియు ప్రభుత్వం ఇచ్చే సమానమైన పండుగ కలిపి 11,71,000/- రూపాయలు Sevanidhi పన్ను కూడా లభిస్తుంది. నాలుగు సంవత్సరాల తర్వాత 25% మందిని పర్మినెంట్ సైనికులుగా ఇండియన్ ఆర్మీలోకి తీసుకోవడం జరుగుతుంది .

అగ్నివీరులకు 4 ఏళ్ల కాలంలో లభించే జీతం వివరాలు:

సంవత్సరంనెలవారీ జీతం (In Hand)అగ్నివీర్ కార్పస్ ఫండ్ (Contribution)
1 వ సంవత్సరంRs. 21,000/-Rs. 9,000/-
2 వ సంవత్సరంRs. 23,100/-Rs. 9,900/-
3 వ సంవత్సరంRs. 25,580/-Rs. 10,950/-
4 వ సంవత్సరంRs. 28,000/-Rs. 12,000/-

అవసరమైన పత్రాలు :: ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు రిక్రూట్మెంట్ ర్యాలీ సమయానికి ఈ క్రింద తెలిపిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

  • పదో తరగతి/ఇంటర్ మార్కుల జాబితా.
  • ఆధార్ కార్డు (లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలి).
  • నివాస ధ్రువీకరణ పత్రం (Residence/Nativity Certificate).
  • కులం సర్టిఫికేట్ (Caste Certificate).
  • స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్.
  • 20 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

ఎంపిక విధానము : ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది ముఖ్యంగా మూడు దశలలో ఉంటుంది. అవి ఒకటి ఆన్లైన్ కామన్ ఎంటర్ ఎగ్జామినేషన్ ఇది పూర్తిగా కంప్యూటర్ల ఆధారిత రాత పరీక్ష రెండవ దశ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే శారీరక సామర్ధ్య పరీక్ష మరియు మెజర్మెంట్ పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా మూడు దశలలో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు

పరీక్ష విధానము : ఆన్లైన్ కంప్యూటర్ పరీక్ష విధానం అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 50 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షను ఒక గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జికి సంబంధించి 15 ప్రశ్నలు, జర్నల్ సైన్స్ విభాగాని సంబంధించి 15 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ విభాగానికి సంబంధించి 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ కి సంబంధించి ఐదు ప్రశ్నలు మొత్తం 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి అర శాతం మార్కులను కోత అనేది విధిస్తారు.

శారీరక సామర్థ్య పరీక్ష (Physical Fitness Test – PFT) :: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ క్రింది పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మొత్తం 100 మార్కులు ఉంటాయి (GD & Tradesmen కి మాత్రమే మార్కులు లెక్కిస్తారు).

1.6 కి.మీ రన్నింగ్:

  • Group I: 5 నిమిషాల 30 సెకన్లలోపు పూర్తి చేస్తే – 60 మార్కులు.
  • Group II: 5 నిమిషాల 31 సెకన్ల నుండి 5 నిమిషాల 45 సెకన్లలోపు – 48 మార్కులు.

పుల్ అప్స్ (Pull-Ups):

  • 10 పుల్ అప్స్: 40 మార్కులు
  • 9 పుల్ అప్స్: 33 మార్కులు
  • 8 పుల్ అప్స్: 27 మార్కులు
  • 7 పుల్ అప్స్: 21 మార్కులు
  • 6 పుల్ అప్స్: 16 మార్కులు (కనీసం 6 తీయాలి)

9 ఫీట్ల డిచ్ (9 Feet Ditch): ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.

జిగ్-జాగ్ బ్యాలెన్స్ (Zig-Zag Balance): ఇది కూడా కేవలం క్వాలిఫై కావాలి.

శారీరక ప్రమాణాలు (Physical Standards) :: రాష్ట్రం మరియు ప్రాంతాన్ని బట్టి ఇవి మారుతుంటాయి, సాధారణంగా తెలుగు రాష్ట్రాల (AP & Telangana) వారికి:

  • ఎత్తు (Height): 166 సెం.మీ (GD కి), 162 సెం.మీ (Technical/Clerk కి).
  • ఛాతీ (Chest): 77 సెం.మీ (+ 5 సెం.మీ గాలి పీల్చినప్పుడు పెరగాలి).
  • బరువు (Weight): ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

దరఖాస్తు ఫీజు :: ఇండియన్ ఆర్మీ నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 250 రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి

ముఖ్యమైన తేదీల వివరాలు ::

ముఖ్యమైన సమాచారంతేదీల వివరాలు
నోటిఫికేషన్ విడుదల అయిన తేదీఫిబ్రవరి 12, 2026
దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ ఫిబ్రవరి 13, 2026
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 01, 2026
ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగే తేదీ 2026 జూన్ 1 నుంచి జూన్ 15, 2026 మధ్యన నిర్వహించే అవకాశం ఉంది.
అధికారిక వెబ్‌సైట్: joinindianarmy.nic.in
Apply Onlinehttps://joinindianarmy.nic.in/Authentication.aspx

మీరు ఆర్మీలో చేరాలని కలలు కంటున్నారా? అయితే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఉద్యోగ వేదికను ఫాలో అవ్వండి!

IndianArmy #Agniveer2026 #ArmyJobs #TeluguJobs #UdyogaVedika #AgnipathScheme #GovtJobs2026 #JobSearch

Q1: అగ్నివీర్ 2026 వయస్సు పరిమితి ఎంత? Ans: 17.5 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్య ఉండాలి (అక్టోబర్ 01, 2005 – ఏప్రిల్ 01, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు).

Q2: అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? Ans: మొదట ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE), తర్వాత ఫిజికల్ టెస్ట్ (PFT), మరియు చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.

Q3: అగ్నివీర్ 2026 రిక్రూట్‌మెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

  • Answer: భారత సైన్యం అగ్నివీర్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12, 2026న విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 13 నుండి ఏప్రిల్ 01, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

Q4: అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD) కి కావలసిన అర్హతలేమిటి?

  • Answer: అభ్యర్థి కనీసం 10వ తరగతిలో 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 17.5 నుండి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

Q5: అగ్నివీర్ 2026 పరీక్ష తేదీ ఎప్పుడు?

  • Answer: ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) జూన్ 01 నుండి జూన్ 15, 2026 మధ్య నిర్వహించే అవకాశం ఉంది.

Q6: అగ్నివీర్ 2026 రిక్రూట్‌మెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

  • Answer: భారత సైన్యం అగ్నివీర్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12, 2026న విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 13 నుండి ఏప్రిల్ 01, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

Q7: అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD) కి కావలసిన అర్హతలేమిటి?

  • Answer: అభ్యర్థి కనీసం 10వ తరగతిలో 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 17.5 నుండి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

Q8: అగ్నివీర్ 2026 పరీక్ష తేదీ ఎప్పుడు?

Answer: ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) జూన్ 01 నుండి జూన్ 15, 2026 మధ్య నిర్వహించే అవకాశం ఉంది.

షేర్ చెయ్యి మామ...

లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి:

WhatsApp ఛానల్ ✅ Telegram ఛానల్ ✈️

👁️ ఈ ఉద్యోగ సమాచారాన్ని ఇప్పటి వరకు

మంది చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *